వాట్సాప్‌లో బ్రాడ్కాస్ట్ చానల్
వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చేందుకు మెటా కసరత్తు చేస్తున్నది. బ్రాడ్కాస్ట్ చానల్‌ను సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురానున్నది. బ్రాడ్కాస్ట్ చానల్ ద్వారా గ్రూప్ తరహాలోనే సంభాషణలకు అవకాశం ఇవ్వనున్నది.
- కొత్త ఫీచర్లు తేనున్న మెటా
శాన్ఫ్రాన్సిస్కో, మే 13: వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చేందుకు మెటా కసరత్తు చేస్తున్నది. బ్రాడ్కాస్ట్ చానల్‌ను సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురానున్నది. బ్రాడ్కాస్ట్ చానల్ ద్వారా గ్రూప్ తరహాలోనే సంభాషణలకు అవకాశం ఇవ్వనున్నది. బ్రాడ్కాస్ట్ చానల్లో వెరిఫికేషన్ స్టేటస్, ఫాలోయర్ల సంఖ్య చూడటం, నోటిఫికేషన్ బటన్ మ్యూట్ చేసుకోవడం, చానల్ డిస్క్రిప్షన్, షార్ట్‌కట్స్, ప్రైవసీ, రిపోర్టింగ్, విజిబులిటీ స్టేటస్ వంటి మొత్తం 12 ఫీచర్లను కూడా చేర్చనుంది.
‘అడ్మిన్ రివ్యూ’ అనే మరో ఫీచర్‌ను వాట్సాప్ గ్రూప్‌లలో కూడా చేర్చనుంది. దీని ద్వారా వాట్సాప్ గ్రూప్‌ల అడ్మిన్లకు పలు కొత్త ఆప్షన్లు రానున్నాయి. గ్రూప్ సభ్యులు ఎవరైనా గ్రూప్‌లోని మెసేజ్ సరైనది కాదని గుర్తిస్తే అడ్మిన్‌కు రిపోర్ట్ చేయవచ్చు. అడ్మిన్ ఆ మెసేజ్‌ను పరిశీలించి డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

