గేట్స్ దంపతుల విడాకులు.. మెలిందాకు 15 వేల కోట్ల విలువైన షేర్లు

న్యూయార్క్: గేట్స్ దంపతుల విడాకుల ప్రకటన తర్వాత.. ఆస్తుల పంపకం మొదలైంది. ఇప్పటికే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ పేరు మీద 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14772 కోట్లు) విలువైన షేర్లు బదిలీ అయ్యాయి. బిల్ గేట్స్ సృష్టించిన హోల్డింగ్ కంపెనీ కాస్కేడ్ ఇన్వెస్ట్మెంట్ మెక్సికోలోని రెండు అతి పెద్ద కంపెనీలను మెలిందాకు బదిలీ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా మెలిందా అందుకున్న మొత్తం షేర్ల విలువ 200 కోట్ల డాలర్లకు చేరింది. తాజాగా కాస్కేడ్ కంపెనీ 50 కోట్ల డాలర్ల విలువైన కోకా-కోలా ఫెంసా, గ్రూపో టెలివిజా కంపెనీల షేర్లను మెలిందాకు బదిలీ చేశాయి.
తామిద్దరం విడిపోతున్నట్లు బిల్ గేట్స్ ప్రకటించిన మే 3వ తేదీనే ఈ బదిలీ జరిగినట్లు తేలింది. కాస్కేడ్ ఇప్పటికే180 కోట్ల డాలర్ల విలువైన కెనడియన్ నేషనల్ రైల్వే కంపెనీ, ఆటోనేషన్ ఐఎన్‌సీల షేర్లను మెలిందాకు బదిలీ చేసింది. చరిత్రలో అత్యంత ఖరీదైన విడాకుల్లో గేట్స్ దంపతులది కూడా ఒకటి కావడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్‌గేట్స్ ప్రస్తుత సంపద విలువ 14420 కోట్ల డాలర్లు (సుమారు రూ.10.6 లక్షల కోట్లు). గేట్స్‌కు సంబంధించి ఈ కాస్కేడ్ ఇన్వెస్ట్‌మెంటే అతి పెద్ద ఆస్తి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

