అమెజాన్ కొత్త సీఈవో ఆండీ జాసీ.. ఇంతకీ ఎవరీయన?

వాషింగ్టన్: అమెజాన్‌కు కొత్త సీఈవో వచ్చారు. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ సోమవారం ఆ పదవి నుంచి తప్పుకొని ఆండీ జాసీకి అప్పగించారు. గతంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) హెడ్‌గా పని చేసిన జాసీ.. ఆ సంస్థలో ఈ స్థాయికి ఎదిగిన తీరు అద్భుతమే. 1994లో తన గ్యారేజ్‌లో అమెజాన్ సంస్థను ప్రారంభించిన బెజోస్ 27 ఏళ్లలో ఆ సంస్థను ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి కంపెనీ బాధ్యతలను చేపట్టబోతుండటం ఒకరకంగా జాసీకి సవాలే. అయితే బెజోస్ మాత్రం ఆయనపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అమెజాన్‌ను లీడ్ చేయడానికి ఆయనే సరైన వ్యక్తి అని ఉద్యోగులకు రాసిన లేఖలో బెజోస్ అభిప్రాయపడ్డారు.
ఎవరీ ఆండీ జాసీ?
ఆండీ జాసీ 1997లో ఓ ప్రాజెక్ట్ మేనేజర్‌గా అమెజాన్‌లో చేరారు. అప్పటికి ఆ సంస్థ ప్రారంభమై కేవలం మూడేళ్లు మాత్రమే అయింది. ఆ తర్వాత సంస్థలో ఎన్నో ఆసక్తికర ప్రాజెక్టులను జాసీ లీడ్ చేశారు. అమెజాన్‌లో చేరకముందు ఎంబీఐ అనే కంపెనీలోనూ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేశారు. ఆ తర్వాత సొంతంగా ఓ కొత్త కంపెనీ ప్రారంభించినా.. జాసీ దానిని మూసేశారు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే పూర్తి చేసి.. ఆ వెంటనే అమెజాన్‌లో చేరారు.
శుక్రవారం నా చివరి పరీక్ష రాసిన నేను.. ఆ తర్వాతి సోమవారమే అమెజాన్‌లో చేరాను. ఆ సమయంలో నేను ఎలాంటి జాబ్ చేయబోతున్నానో కూడా నాకు తెలియదు అని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పాడ్‌కాస్ట్‌లో జాసీ అన్నారు. తాను ఏం పని చేయబోతున్నానో కూడా తెలియకుండానే అమెజాన్‌లో చేరానన్న జాసీ.. కొన్నేళ్లలోనే సంస్థలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 2003లో బెజోస్‌తో కలిసి క్లౌడ్ కంప్యూటింగ్‌ను క్రియేట్ చేయాలన్న ఆలోచనతో వచ్చారు.
మలుపు తిప్పిన ఏడబ్ల్యూఎస్
57 మంది సభ్యుల టీమ్‌కు హెడ్‌గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)ను డెవలప్ చేసే పనిని జాసీ ప్రారంభించారు. 2006లో ఈ ఏడబ్ల్యూఎస్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఇదీ ఒకటి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్, ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్ క్లౌడ్‌తో ఈ కంపెనీ పోటీ పడుతోంది. ఈ ఏడబ్ల్యూఎస్‌ను విజయవంతంగా ముందుకు నడిపిన జాసీ 2017లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఏడబ్ల్యూఎస్ సీఈవోగా మారారు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌కే సీఈవో అయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

