Helicopter Crash: మెడికల్ హెలికాప్టర్ సముద్రంలో కూలి ముగ్గురు మృతి, ముగ్గుర్ని రక్షించిన కోస్టు గార్డు
helicopter crashes: జపాన్‌లో విషాదం చోటుచేసుకున్నది. ఓ మెడికల్ హెలికాప్టర్.. సుసీమా దీవుల సమీపంలోని సముద్రంలో కూలింది. పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గుర్ని రక్షించారు.
టోక్యో: జపాన్‌ల్లో ఓ మెడికల్ ట్రాన్స్‌పోర్టు హెలికాప్టర్ కూలింది(Helicopter Crash). ఈ ఘటన ఆ దేశ నైరుతీ దిశలో చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో పేషెంట్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పైలట్ హిరోషి హమదా, హెలికాప్టర్ మెకానిక్ కజుటో, 28 ఏళ్ల నర్సు సకురా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గుర్నీ కోస్టు గార్డులు రెస్క్యూ చేశారు. ముగ్గరరూ హైపోథర్మియాతో బాధపడ్డారు. కానీ స్పృహలో ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
ప్రమాదంలో మరణించిన వారిలో మెడికల్ డాక్టర్ కీవ్ అరకావా, పేషెంట్ మిత్సుకీ మోటోషి, ఆ పేషెంట్ కేర్‌టేకర్ కజుయోషి మోటిషి ఉన్నారు. ఆ ముగ్గురి మృతదేహాలను జపాన్ ఎయిర్ సెల్ఫ్ దిఫెన్స్ ఫోర్స్ హెలికాప్టర్ రికవరీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు విమానాలు, మూడు నౌకలను కోస్టు గార్డులు మోహరించారు.
నాగసాకి జిల్లా నుంచి ఫుకునోవా హాస్పిటల్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో దర్యాప్తులో తేలాల్సి ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

