టెక్నాస్, జనవరి 31: ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ రెస్టారెంట్‌ను మెక్ డొనాల్డ్స్ ప్రారంభించింది. అమెరికాలో టెక్సస్‌లోని వైట్ సెటిల్మెంట్ పట్టణంలో ఈ రెస్టారెంట్ మొదలైంది. ఇందులో పని చేసేందుకు వెయిటర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది ఎవరూ ఉండరు.
తినడానికి వచ్చిన కస్టమర్లే వారికి ఏం కావాలో ఏటీఎం లాంటి స్క్రీన్‌పై ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసిన ఆహారాన్ని రోబోలు మన టేబుల్ వద్దకు తీసుకువస్తాయి. పార్సిల్ తీసుకోవాలనేకొనేవారు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఈ రోబోలు కారు వద్దకు వచ్చి మరీ అందిస్తాయి. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ టెక్నాలజీ.. విజయవంతంగా పని చేస్తే ఇలాంటివి మరిన్ని తెరిచే అవకాశం ఉన్నది. ఇదే జరిగితే ఈ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నది.