MasterChef Australia: మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియా జడ్జి జాక్ జాన్ఫ్రిల్లో ఆకస్మిక మృతి
MasterChef Australia: మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియా హోస్ట్ జాక్ జాన్ఫ్రిల్లో మృతిచెందారు. నెట్వర్క్ 10లో ప్రసారం అవుతున్న ఆ షోలో జాక్ జడ్జిగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి చెఫ్‌లతో ఆయన పనిచేశారు.
మెల్బోర్న్: మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియా(MasterChef Australia) షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రఖ్యాత చెఫ్ జాక్ జాన్ఫ్రిల్లో అకస్మాత్తుగా మరణించారు. ఆయన వయసు 46 ఏళ్లు. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన చెఫ్ జాక్.. ప్రపంచవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లలో మేటి చెఫ్‌లతో కలిసి పనిచేశారు. నెట్వర్క్ 10లో ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా సిరీస్‌కు విశేష స్పందన ఉంటుంది. నిజానికి ఇవాళ 2023 సీజన్‌కు చెందిన మాస్టర్‌చెఫ్ ప్రీమియర్‌ను ప్రసారం చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రీమియర్‌ను ఆపేస్తున్నట్లు నెట్వర్క్ 10 ద్రువీకరించింది.
జడ్జి జాన్ఫ్రిల్లోకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మెల్బోర్న్లోని తన ఇంట్లో ఆయన శవమై తేలారు. జాక్ మరణంపై ఎటువంటి అనుమానాలు లేవని విక్టోరియా పోలీసులు వెల్లడించారు. ఒరానా పేరుతో ఆస్ట్రేలియాలో ఓ రెస్టారెంట్‌ను జాక్ ఓపెన్ చేశారు. అయితే ఆ హోటల్ దివాళా తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియా హోమ్ ఫుడ్ గురించి మాస్టర్‌చెఫ్ షోలో జాక్ అనేక కార్యక్రమాలు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

