ల్యాండ్ అయిన విమాన చక్రం వద్ద మనిషి మృతదేహం.. నల్లజాతీయుడిగా గుర్తింపు
విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం చక్రం వద్ద మనిషి మృతదేహం కనిపించింది. ఇది చూసి విమానాశ్రయ సిబ్బంది షాక్ అయ్యారు.
లండన్: విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం చక్రం వద్ద మనిషి మృతదేహం కనిపించింది. ఇది చూసి విమానాశ్రయ సిబ్బంది షాక్ అయ్యారు. మృతుడ్ని నల్లజాతీయుడిగా గుర్తించారు. ఈ నెల 5న గాంబియాకు చెందిన టీయూఐ ఎయిర్వేస్ విమానం ఆ దేశ రాజధాని బంజుల్ నుంచి టేకాఫ్ అయ్యింది. గమ్యస్థానమైన లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే ఆ విమాన చక్రం వద్ద ఒక నల్లజాతి వ్యక్తి మృతదేహం ఉండటాన్ని విమానాశ్రయ సిబ్బంది గమనించారు. దీంతో బ్రిటన్‌లోని ససెక్స్ మెట్రోపాలిటన్ పోలీసులు ఈ విషయాన్ని గాంబియా ప్రభుత్వానికి తెలియజేశారు.
కాగా, గాంబియా ప్రభుత్వం ఈ సంఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది. విమాన చక్రం వద్ద మరణించి ఉన్న నల్లజాతి పురుషుడి పేరు, వయస్సు, జాతీయత, ప్రయాణ చరిత్రకు సంబంధించిన వివరాలు, తమ దేశీయుడా కాదా అన్నది తెలియదని తెలిపింది. ఆ వ్యక్తిని గుర్తించేందుకు మృతదేహానికి డీఎన్యే టెస్ట్‌ను బ్రిటన్ పోలీసులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశంలో బ్రిటన్ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించింది.
మరోవైపు ఆఫ్రియా దేశాల నుంచి ఐరోపాకు అక్రమంగా వలస వెళ్లేందుకు కొందరు విమాన చక్రాల వద్ద నక్కి దొంగచాటుగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మృత్యవాతపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

