FBI | అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి కాల్చివేత
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు తెలిపారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు తెలిపారు. బైడెన్‌తోపాటు కమలా హారీస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్‌కి డబ్బు చెల్లించారనే ఆరోపణలపై అభియోగాలు మోపిన మాన్మట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్లను చంపుతానని యూటా రాష్ట్రానికి (Utah state) చెందిన క్రెయిగ్ రాబర్ట్సన్ (Craig Robertson) అనే వ్యక్తి ఫేస్బుక్లో బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యూటా రాష్ట్రంలో అధ్యక్షుడు బైడెన్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఎఫ్‌బీఐ అధికారులు రాబర్ట్సన్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడని అధికారులు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఎఫ్‌బీఐ ఇంకా పూర్తివివరాలు వెళ్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

