లండన్, అక్టోబర్ 25: వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్ అతి ముఖ్యం. చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనాన్ని రోడ్డుపై నడుపలేం. అయితే, చాలామంది రిజిస్ట్రేషన్ నంబర్లను సంఖ్యాశాస్త్రం ప్రకారం తీసుకొనేందుకు ఆసక్తి చూపుతారు. తమకు అనుకూలమైన నంబర్ కోసం ఎంతైనా వెచ్చిస్తారు.
ఇప్పటివరకూ భారతదేశంలో రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన అత్యధిక మొత్తం రూ.30లక్షలు. అయితే, యూకే లో ఓ వ్యక్తి తనకు నచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను రూ.132 కోట్లకు సొంతం చేసుకొన్నాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘ఎఫ్ 1’ రిజిస్ట్రేషన్ నంబర్‌ను యూకేకు చెందిన ఖాన్ డిజైన్స్ కంపెనీ అధినేత అఫ్జల్ ఖాన్ భారీధరకు దక్కించుకున్నాడు.