మహిళను కాపాడేందుకు.. కారును త్యాగం చేసిన వ్యక్తి

ఆమ్స్టర్డామ్: అపస్మారక స్థితిలో కారును డ్రెవ్ చేస్తున్న మహిళను కాపాడేందుకు ఒక వ్యక్తి తన కారును త్యాగం చేశాడు. వేగంతో వెళ్తున్న ఆమె కారు ముందుకు తన కారును నడిపి వెనుక నుంచి ఢీకొనేలా చేసి నిలుపగలిగాడు. నెదర్లాండ్స్‌లోని నన్స్పీట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. హెన్రీ టెమ్మెర్మాన్స్ అనే వ్యక్తి కారులో ఇంటికి వెళ్తుండగా ఒక కారు అడ్డదిడ్డంగా రోడ్డు మార్జిన్‌ను దాటి వేగంగా వెళ్లడాన్ని గమనించాడు. కాస్త దగ్గరకు వెళ్లి పరిశీలించగా ఆ కారును డ్రైవ్ చేస్తున్న మహిళ సృహలో లేనట్లు అతడు గ్రహించాడు.
దీంతో హెన్రీ తన కారును వేగంగా ఆమె కారు ముందుకు తీసుకెళ్లాడు. తన కారు వెనుక భాగాన్ని ఆ మహిళ కారు ఢీకొట్టేలా చేశాడు. దీంతో ఆమె కారును ఆపగలిగాడు. అనంతరం కారును నడుపుతున్న ఆ మహిళ పరిస్థితిని అతడు గమనించగా ఆమె వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలో ఉన్నది. దీంతో వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కొంత సేపటికి అంబులెన్స్ రాగా, ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వల్ల ఆమెకు ఐదు రిబ్స్ విరిగాయి.
మరోవైపు ఆ మహిళ కారు హెన్రీ కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో అది కదలలేని స్థితికి చేరింది. దీంతో పోలీస్ వాహనం ద్వారా దానిని అక్కడి నుంచి తరలించారు. కాగా, వెనుక ఉన్న మరో కారు డ్యాష్ బోర్డ్‌పై ఉన్న కెమెరాలో ఈ ఘటన అంతా రికార్డు అయ్యింది. ఆ కారులోని వ్యక్తి కూడా ఆ మహిళను ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేశాడు. అనంతరం హెన్రీని అతడి ఇంటి వద్ద డ్రాప్ చేశాడు.
అనంతరం ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు హెన్రీ సాహసాన్ని కొడియాడారు. అపస్మారక స్థితిలో ఉండి కారు నడుపుతున్న మహిళను రక్షించేందుకు తన కారును త్యాగం చేసిన అతడిని రియల్ హీరో అని ప్రశంసించారు. సాధారణంగా వాహనదారులు ప్రమాదంలో ఉన్నా చాలా మంది చూసి కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తారని, హెన్రీ లాంటి కొందరు మాత్రమే సాహసం చేసి కాపాడేందుకు చొరవ చూపుతారని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

