Man Opens Emergency Exit | విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచి రెక్కపై నడిచిన వ్యక్తి.. అతడి చర్యను సమర్థించిన ప్రయాణికులు
Man Opens Emergency Exit | విమాన ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరిచాడు. (Man Opens Emergency Exit) విమానం రెక్క మీదకు వెళ్లి దానిపై నడిచాడు. ఆ తర్వాత తిరిగి విమానంలోకి వచ్చాడు. అయితే ఆ వ్యక్తి చర్యను తోటి ప్రయాణికులు సమర్థించారు. అతడు తమ ప్రాణాలు కాపాడినట్లు రాత పూర్వకంగా పేర్కొన్నారు.
మెక్సికో సిటీ: విమాన ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరిచాడు. (Man Opens Emergency Exit) విమానం రెక్క మీదకు వెళ్లి దానిపై నడిచాడు. ఆ తర్వాత తిరిగి విమానంలోకి వచ్చాడు. అయితే ఆ వ్యక్తి చర్యను తోటి ప్రయాణికులు సమర్థించారు. అతడు తమ ప్రాణాలు కాపాడినట్లు రాత పూర్వకంగా పేర్కొన్నారు. మెక్సికోలో ఈ సంఘటన జరిగింది. శనివారం మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గ్వాటెమాలాకు వెళ్లే ఏరోమెక్సికో విమానంలో 77 మంది ప్రయాణికులున్నారు. అయితే ఆ విమానం టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో వెంటిలేషన్, తాగు నీరు లేకుండా అందులోని ప్రయాణికులు సుమారు నాలుగు గంటలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాగా, ఒక ప్రయాణికుడు విమానంలోని ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. విమానం రెక్క మీదకు వెళ్లి దానిపై నడిచాడు. ఆ తర్వాత తిరిగి విమానంలోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడ్ని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
మరోవైపు ఆ విమానంలోని మిగతా ప్రయాణికులు ఆ వ్యక్తి చర్యను సమర్థించారు. విమానంలో గాలి, నీరు లేక నాలుగు గంటలపాటు ఇబ్బంది పడిన తమ ప్రాణాలను అతడు కాపాడినట్లు తెలిపారు. అందరి మద్దతుతో ప్రతి ఒక్కరినీ రక్షించడానికి ఆ వ్యక్తి అలా చేశాడని చెప్పారు. ఈ మేరకు రాతపూర్వక పత్రంపై సంతకాలు చేసి ఎయిర్పోర్ట్ అధికారులకు అందజేశారు. అలాగే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్న డైలమాలో ఎయిర్పోర్ట్ అధికారులు ఉన్నారు.
https://twitter.com/CapiSuperGirl/status/1751301195023392808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1751301195023392808%7Ctwgr%5Eaaa558f35e02f59ba14a7d1a4f40688192ab972b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fworld%2Fvideo-man-opens-emergency-exit-walks-on-parked-planes-wings-at-mexico-airport-co-passengers-say-he-saved-our-lives
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

