viral video | ప్రాణాపాయం నుంచి త్రుటిలో ఎలా బయటపడ్డాడంటే..!
ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. లాండ్రీ నుంచి ఓ వ్యక్తి తన దుస్తులను తీసుకుని బయటకు వెళ్లిన కొద్దినిమిషాలకే రూంలోని వాషింగ్ మెషీన్లలో ఒకటి పేలిపోయి మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ : ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. లాండ్రీ నుంచి ఓ వ్యక్తి తన దుస్తులను తీసుకుని బయటకు వెళ్లిన కొద్దినిమిషాలకే రూంలోని వాషింగ్ మెషీన్లలో ఒకటి పేలిపోయి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సదరు వ్యక్తి లోపలే ఉంటే అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.
Someone didn't check their pockets pic.twitter.com/MjpK5mPba7
— OnlyBangers (@OnlyBangersEth) April 2, 2023
ఓన్లీ బ్యాంగర్స్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ 40 లక్షల వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన దుస్తులను ఉతుక్కుని డ్రై చేసుకున్న తర్వాత లాండ్రీ నుంచి బయటకు రావడం కనిపిస్తుంది. అతడు లాండ్రీ నుంచి బయటపడిన కొద్ది సెకండ్లకే ఓ వాషింగ్ మెషీన్ పేలిపోయి మంటలు వ్యాప్తించడం చూడొచ్చు.
పేలుడు భయంకరంగా ఉండటంతో ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే తీవ్రంగా గాయపడే వారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తలోరకంగా స్పందించారు. ప్రమాదం నుంచి ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నామని పలువురు కామెంట్ చేశారు. బ్యాటరీ సమస్యతోనే పేలుడు జరిగిఉంటుందని మరో యూజర్ సందేహం వ్యక్తం చేశారు. యాక్షన్ మూవీ ఓపెనింగ్ సీన్లా ఉందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More
Viral Video | మినీ స్కర్ట్‌తో మెట్రో రైల్లో యువతి ప్రత్యక్షం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Escape
- MAN
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

