హెలికాప్టర్‌కు చిక్కుకున్న పారాచూట్.. గాల్లో వేలాడిన వ్యక్తి

మాస్కో: పారాచూట్ హెలికాప్టర్‌కు చిక్కుకోవడంతో ఒక వ్యక్తి ప్రమాదకరంగా కొంత సేపు గాల్లో వేలాడాడు. గమనించిన ఒకరు దీనిని తన మొబైల్లో చిత్రీకరించి పోలీసులను అప్రమత్తం చేశారు. రష్యన్ ప్రాంతమైన జబాయికల్స్కీ క్రైలోని కాష్టక్ గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఒక పారాగైడర్ హెలికాప్టర్ నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు ధరించిన పారాచూట్ హెలికాప్టర్ వెనుక ఉన్న రోటర్‌కు చిక్కుకున్నది. దీంతో అతడు గాల్లో వేలాడసాగాడు.
కాగా, మాగ్జిమ్ స్టెఫానోవిచ్ అనే వ్యక్తి దీనిని చూశాడు. తొలుత సైనిక విన్యాసంగా ఆయన భావించాడు. తన మొబైల్లో వీడియో రికార్డు చేశాడు. దానిని గమనించగా ఆ వ్యక్తి ప్రమాదకరంగా గాలిలో వేలాడుతున్నట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతడిని రక్షించేందుకు మిలిటరీ సహాయం కోరాలని చెప్పాడు.
మరోవైపు ఆ హెలికాప్టర్ మెల్లగా ఆ పారాచూటర్ను కిందకు దించింది. దీంతో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం మాగ్జిమ్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

