బ్రిటన్ ప్రధాని గెటప్‌లో.. క్రికెట్ స్టేడియంలో ఓ వ్యక్తి హంగామా.. వీడియో
లీడ్స్: బ్రిటన్ ప్రధాని జోరిస్ జాన్సన్ తరహాలో గెటప్ వేసుకుని ఓ వ్యక్తి ఇంగ్లండ్‌లోని క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకుల్ని నవ్వించాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లీడ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్టు రెండవ రోజున ఈ ఘటన జరిగింది. బోరిస్ జాన్సన్ తరహాలో డ్రెస్సింగ్ వేసుకున్న వ్యక్తి స్టేడియంలోని స్టాండ్స్‌లో పరుగులు తీస్తూ కనిపించాడు. అయితే ఆ వ్యక్తి వెనకాలా పోలీసుల తరహాలో డ్రెస్ వేసుకున్న కొందరు అతన్ని వెంటాడుతూ కనిపించారు. హెడ్డింగ్లీ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ ఘటన అక్కడ ఉన్న వారిని ఆలోచింపచేసింది. ఇటీవల ప్రధాని బోరిస్ జాన్సన్‌పై పార్టీగేట్ ఆరోపణలు వచ్చాయి. కరోనా ఉధృతి సమయంలో ప్రధాని ఆఫీసులో భారీగా పార్టీలు జరిగాయని, ఆంక్షలను ఉల్లంఘించినట్లు బోరిస్‌పై ఆరోపణలు ఉన్నాయి. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో 12 పార్టీలు జరగ్గా, దాంట్లో బోరిస్ ఆరు పార్టీలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. కానీ బోరిస్ విశ్వాస పరీక్ష నెగ్గారు. ఇక బోరిస్‌ను ఎద్దేవ చేస్తూ చేసిన ఈ వీడియోకు తెగ లైక్‌లు, కామెంట్లు వచ్చేస్తున్నాయి. నిజమైన బోరిస్ జాన్సన్ అంటూ కూడా కొందరు కామెంట్ చేశారు.
Boris Johnson being chased by a group of policemen 😂😂😂
📹 @turpinmodernist #ENGvNZ pic.twitter.com/9R7lW2TUu9
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 25, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

