నిద్రలో వచ్చిన కల నిజమనుకుని.. కత్తితో అవి కోసేసుకున్నాడు
నిద్రలో వచ్చిన కలను నిజమనుకున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో కుర్చీలో కునుకుతీసిన ఓ వ్యక్తి మేకను వధిస్తున్నట్టు భావించి తన జననాంగాలను కత్తితో కోసేసుకున్నాడు. నిద్రమత్తు వదిలాక విషయం తెలుసుకుని లబోదిబోమన్నాడు. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
నిద్రలో వచ్చిన కలను నిజమనుకున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో కుర్చీలో కునుకుతీసిన ఓ వ్యక్తి మేకను వధిస్తున్నట్టు భావించి తన జననాంగాలను కత్తితో కోసేసుకున్నాడు. నిద్రమత్తు వదిలాక విషయం తెలుసుకుని లబోదిబోమన్నాడు. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
ఘనాలోని అసిన్ ఫోసు పట్టణానికి చెందిన రైతు కోఫీ అట్టా (42) భార్య ఊరెళ్లింది. ఆగస్టు 12న అతనొక్కడే ఇంట్లో ఉన్నాడు. కుర్చీలో కూర్చొని కునుకు తీస్తున్నాడు. లంచ్ కోసం అతడి భార్యకు సహాయం చేసేందుకుగానూ మేకను కోస్తున్నట్లు కల కన్నాడు. అయితే, కత్తి తీసుకొని నిజంగానే తన పురుషాంగంతోపాటు జననేంద్రియాలను కోసుకున్నాడు. విపరీతమైన నొప్పిరావడంతో మేల్కొన్నాడు. జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. గట్టిగా అరిచాడు. పొరుగువారు గమనించి అతడి భార్యకు సమాచారమందించారు. కొద్దిసేపటికే అట్టా భార్య అడ్వోవా కోనాడు ఇంటికి చేరుకుంది. భర్త జననాంగాలనుంచి రక్తం కారుతుండగా డైపర్ వేసి, దవాఖానకు తీసుకెళ్లింది.
బాధితుడిని మొదట అసిన్ ఫోసులోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కాథలిక్ దవాఖానలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని కోంఫో అనోకీ టీచింగ్ హాస్పిటల్కు తరలించారు. ఆరు వారాల శస్త్రచికిత్స తర్వాత తిరిగి అతడి పురుషాంగాన్ని అతికించొచ్చని వైద్యులు తెలిపారు. అంగం పనితీరు యధావిధిగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

