Dating | డేటింగ్‌కు వెళ్తే క్యాష్ ప్రైజ్.. ఉద్యోగులకు టెక్ కంపెనీ బంపరాఫర్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒంటరి ఉద్యోగులు ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా జీవితంలోని ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. ప్రపంచం అంతటా ఈ సమస్య ఉన్నట్టే చైనాలో కూడా ఉంది. విజయమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉద్యోగులు వ్యక్తిగత జీవితాన్ని విస్మరిస్తుండటంతో చైనా కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.
- చైనా కంపెనీ ఆఫర్
Dating | న్యూఢిల్లీ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒంటరి ఉద్యోగులు ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా జీవితంలోని ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. ప్రపంచం అంతటా ఈ సమస్య ఉన్నట్టే చైనాలో కూడా ఉంది. విజయమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉద్యోగులు వ్యక్తిగత జీవితాన్ని విస్మరిస్తుండటంతో చైనా కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఒంటరి ఉద్యోగులు డేటింగ్‌కు వెళ్తే నగదు ప్రోత్సహకాలు అందిస్తామని ప్రకటించింది. షెంజెన్‌కు చెందిన ‘ఇన్‌స్టా360’ అనే టెక్ కంపెనీ ఈ బంపరాఫర్ ప్రకటించింది.
పార్ట్నర్ను పరిచయం చేస్తూ కంపెనీ డేటింగ్ ప్లాట్‌ఫాంపై పోస్టు పెడితే 66 యువాన్లు (దాదాపు రూ. 770) ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు, ఆ బంధం విజయవంతంగా మూడు నెలలపాటు కొనసాగితే ఆ జంటతోపాటు వారిని కలిపిన వారికి 1,000 యువాన్లు (దాదాపు రూ.11,650) ఇస్తామని తెలిపింది. ఉద్యోగుల జీవితాల్లో సంతోషం నింపడంతోపాటు మనది అనే భావన పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్రోత్సాహకం ప్రారంభించిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 500 పోస్టులు వచ్చినట్టు పేర్కొంది. ఇందుకు గాను 10 వేల యువాన్ల (దాదాపు రూ. 1.16 లక్షలు) ప్రోత్సాహకాలు అందించినట్టు వివరించింది. కంపెనీ ప్రకటించిన ఈ సరికొత్త ప్రోత్సాహకాలపై ఓ ఉద్యోగి మాట్లాడుతూ తన విషయంలో తన తల్లి కంటే కంపెనీయే ఆసక్తిగా ఉందని చమత్కరించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

