Lay off | నేడు 11 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మైక్రోసాఫ్ట్ !
Microsoft | ప్రపంచంలోనే నంబర్‌వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై
న్యూయార్క్: ప్రపంచంలోనే నంబర్‌వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై నేడు వేటు వేయనుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. వారంతా మానవ వనరులు (హెచ్ఆర్), ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులని తెలిపిపాయి. కంపెనీలో గత జూన్ 30 నాటికి మొత్తం 2 లక్షల 21 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. వారిలో 1 లక్షా 22 వేల మంది అమెరికాలో పనిచేస్తుండగా, 99 వేల మంది వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. కాగా, మెక్రోసాఫ్ట్ గత అక్టోబర్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
ఆర్థిక మాంద్యం భయాలు, డిమాండ్ తగ్గిపోవడంతో అమెజాన్, మెటా సహా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్ రెండు విడుతల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించగా, మెటా 11 వేల మందిపై వేటు వేసింది.
కాగా, క్లౌడ్ సేవల్లో అజూర్‌పై ఎక్కువగా దృష్టిపెడుతుండటంతో మైక్రోసాఫ్ట్‌లో పాత టెక్నాలజీలకు సంబంధించి ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఉన్న ప్రపంచవ్యాప్త అమ్మకాల ప్రక్రియను కూడా క్లౌడ్ సర్వీస్‌కు మార్చే ఆలోచనలో సంస్థ ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Amazon
- employees
- engineering
- HR
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

