తుపాకుల నియంత్రణకు అమెరికాలో చట్టం
- అధ్యక్షుడు బైడెన్ సంతకం
వాషింగ్టన్, జూన్ 26: తుపాకుల వాడకంపై నియంత్రణ కోసం అమెరికా సర్కారు చట్టం చేసింది. బిల్లుపై అధ్యక్షుడు బైడెన్ శనివారం సంతకం చేశారు. ‘ఈ చట్టం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది’ అన్నా రు. అయితే, తాను కోరుకొంటున్న అన్ని అంశాలు ఈ చట్టంలో లేవని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం సరిపోతుందని వ్యాఖ్యానించారు. బిల్లుకు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వడం చరిత్రాత్మకం అన్నారు. యువకులు, నేరపూరిత స్వభావం ఉన్నవారికి తుపాకులు తేలిగ్గా లభించకుండా ఈ చట్టం నియంత్రిస్తుంది. ప్రమాదకరమైన వ్యక్తులుగా భావిస్తున్నవారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. తుపాకుల అక్రమ రవాణాను నిరోధిస్తుంది. ఈ బిల్లు శుక్రవారం ప్రతినిధుల సభలో 234-193 ఓట్ల తేడాతో పాసైంది. అంతకుముందు రోజే సెనేట్‌లో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

