తాను డిజైన్ చేసిన ల్యాండ్ రోవర్లోనే ప్రిన్స్ ఫిలిప్ అంతిమయాత్ర

లండన్: క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈ శనివారం జరగనున్నాయి. అయితే ప్రిన్స్ ఫిలిప్‌కు నచ్చిన వాహనంలోనే తన పార్దీవదేహాన్ని తీసుకువెళ్లనున్నారు. ల్యాండ్ రోవర్ కారులో ప్రిన్స్ ఫిలిప్ శవపేటికను విండ్సర్ క్యాజిల్ గార్డెన్స్‌కు తరలించనున్నారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని 2005 నుంచి ఫిలిప్ వాడుతున్నారు. ఆ వాహనాన్ని ఆయనే రీ డిజైన్ చేశారు. డిఫెండర్ 130 గన్ బస్సును .. రాజకుటుంబ సేవల కోసం ప్రిన్స్ ఫిలిప్ మార్పు చేశారు. శనివారం రోజున 8 నిమిషాల పాటు సాగే అంత్యక్రియ ఊరేగింపులో.. ప్రిన్స్ ఫిలిప్ పార్దీవదేహాన్ని ఆ వాహనంలోనే తరలించనున్నారు. ఫోలో స్పెషలిస్టు వెహికిల్స్ సంస్థ .. ప్రిన్స్ ఫిలిప్‌కు చెందిన ల్యాండ్ రోవర్ వాహాన్ని మాడిఫై చేసింది. డీప్ బ్రాంజ్ గ్రీన్ రంగులో ఆ కారు ఉంటుంది. ల్యాండ్ రోవర్ డిజైన్, ఇంజనీరింగ్‌లో ప్రిన్స్ ఫిలిప్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అయితే తనకు ఇష్టమైన వాహనంలోనే తుది వీడ్కోలు పలకడం అంటే ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నట్లే అని ప్రముఖులు పేర్కొన్నారు. ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న అంతిమ సంస్కారాలకు కేవలం 30 మంది గెస్టులకు మాత్రమే అవకాశం కల్పించారు. ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ హ్యారీలు అంతిమ వీడ్కోల్లో పాల్గొంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

