వాడి పేరు తోడేలు కాదు.. ఇన్‌స్టాలో కొడుకు పేరు వెల్లడించిన స్టార్ హీరోయిన్
Kylie Jenner | కైలీ జెన్నర్, ట్రావిస్ స్కాట్ (జాక్వెస్ వెబ్‌స్టర్) దంపతులకు 2022 ఫిబ్రవరి 2న రెండో సంతానంగా కొడుకు జన్మించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే తమ కొడుకుకు వోల్ఫ్ వెబ్‌స్టర్ అని పేరు పెట్టినట్లు ఆ జంట ప్రకటించింది.
వాషింగ్టన్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్, మోడల్, అమెరికాలో ప్రముఖ మహిళా వ్యాపారవేత్త అయిన కైలీ జెన్నర్ ఎట్టకేలకు తన కొడుకు పేరును వెల్లడించింది. కైలీ జెన్నర్, ట్రావిస్ స్కాట్ (జాక్వెస్ వెబ్‌స్టర్) దంపతులకు 2022 ఫిబ్రవరి 2న రెండో సంతానంగా కొడుకు జన్మించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే తమ కొడుకుకు వోల్ఫ్ వెబ్‌స్టర్ అని పేరు పెట్టినట్లు ఆ జంట ప్రకటించింది.
తమ కొడుకు పేరు వోల్ఫ్ వెబ్‌స్టర్ కాదని, తాను ఎక్కడికి వెళ్లినా తోడేళ్లను చూడటానికి ఇష్టపడతాను కాబట్టి కొన్ని రోజులు సరదాగా ఆ పేరుతో పిలిచామని 2022 మార్చి 21 న కైలీ జెన్నర్ తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నది. కానీ పర్మనెంట్ పేరు ఏందనేది ఆమె వెల్లడించలేదు. దాదాపు ఏడాది తర్వాత తాజాగా చేసిన ఇన్‌స్టా పోస్టులో ఆమె తన కొడుకు అసలు పేరును వెల్లడించింది.
ఏడాది కొడుకుతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అతడి పేరు ఐరే వెబ్స్టర్గా వెల్లడించింది. అలా కొడుకు అసలు పేరుతోపాటు కొడుకు ఫొటోను కూడా తొలిసారి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కైలీ, ట్రావిస్లు 2017 నుంచి సహజీవనం చేసి ఆ తర్వాత పెండ్లి చేసుకున్నారు. వారికి స్టార్మీ వెబ్‌స్టర్ అనే నాలుగేండ్ల పాప కూడా ఉన్నది. కాగా, కైలీ జెన్నర్‌కు కైలీ కాస్మటిక్స్ పేరుతో ఒక వ్యాపార సంస్థ ఉన్నది.
https://www.instagram.com/p/CnsVre4SqSS/?utm_source=ig_web_copy_link
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

