న్యూయార్క్: కైలీ జెన్నర్ ఇన్స్టాగ్రామ్లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కైలీ కాస్మటిక్స్ వ్యవస్థాపకురాలైన ఆమె.. ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాలో దూసుకెళ్తోంది. ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 30 కోట్లు దాటింది. దీంతో ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. గతంలో పాప్ స్టార్ ఏరియానా గ్రాండే పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాసింది. ఇన్స్టాలో అత్యధిక మంది ఫాలో అవుతోంది ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో. అతన్ని 38.8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అతని తర్వాత ఇప్పుడు 24 ఏళ్ల కైలీ జెన్నర్ రెండవ స్థానంలో నిలిచింది. గత కొన్ని నెలల నుంచి కైలీ లో ప్రొఫైల్లో ఉన్నా.. ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతోంది.