మాషాద్: ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ .. అంత్యక్రియలు(Khameneis Funeral) చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఆయన స్వంత ఊరు మాషాద్లో .. ఖమేనీ శవపేటికను సమాధి చేయనున్నారు. వేల సంఖ్యలో ప్రజలు తుది వీడ్కోలు పలుకుతున్నారు. నార్త్ ఈస్ట్రన్ ఇరాన్లో ఉన్న మాషాద్.. తీవ్ర విషాదంతో నిండిపోయింది. ఇరానీ జెండాలతో ప్రదర్శన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలంటూ(Kill Trump) కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. కిల్ ట్రంప్ అన్న ప్లకార్డులతో అంత్యక్రియల్లో ఖమేనీ మద్దతుదారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ జరిగిన దాడిలో ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే.
از مشهد به کل دنیا:
✊we will kill trump#باید_برخاست#منادی_بعثت pic.twitter.com/FjKspie7bV
— بچه سیرجونی (@samsafi264) July 9, 2026
🚨في مدينة مشهد في إيران، تم تعليق لافتة باللغة الإنجليزية تقول:
“سنقتل ترامب”#IranWar pic.twitter.com/FN5c15hYCx
— ديوان (@DiwanDaily) July 8, 2026
అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు ఓ భారీ బ్యానర్ ప్రదర్శించారు. ట్రంప్‌ను చంపేస్తామంటూ ఆ బ్యానర్‌పై రాసి ఉన్నది. మరో ప్రదేశంలో ఓ బిల్డింగ్‌కు ట్రంప్‌ను హతమారుస్తామంటూ బ్యానర్ కట్టారు. ఇరానీ అధ్యక్షుడు మౌసాద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీపై ప్రజలు అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
A massive banner reading “We will kill Trump” was held aloft by mourners during the funeral procession of martyred Leader of the Islamic Revolution Ayatollah Seyed Ali Khamenei in Tehran on Monday, as participants vowed retribution for the assassination of their beloved Leader. pic.twitter.com/EX3ujdPTEu
— Tasnim News Agency (@Tasnimnews_EN) July 6, 2026
ఖమేనీకి కడసారి వీడ్కోలు పలికేందుకు ఇరానియన్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇమామ్ రేజా స్ట్రీట్.. లక్షలాది మంది జనంతో కిక్కిరిసిపోయింది. అయతుల్లా అలీ ఖమేనీ పార్దీవదేహానికి నివాళ్లు అర్పిస్తున్నారు. అంత్యక్రియలకు హాజరవుతున్న జనం.. భావోద్వేగాలకు గురయ్యారు. ప్రియతమ నేతను కోల్పోయిన వేదనతో ఏడ్చేస్తున్నారు. నల్ల దుస్తుల్లో హాజరైన జనం.. ఇమామ్ ఖమేనీ మృతి పట్ల విలపిస్తున్నారు. కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఇమామ్ రెజీ మసీదు వద్ద జనం భారీ సంఖ్యలో చేరుకున్నారు.