Abdul Gaffar Khan : సరిహద్దు గాంధీకి ‘భారతరత్న’
Abdul Gaffar Khan : భారతదేశం స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులతో పదం కదిపిన సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు భారత ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు ఇతడే

భారతదేశం స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులతో పదం కదిపిన సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు (Abdul Gaffar Khan) భారత ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు ఇతడే. భారతదేశం విభజన అనంతరం పాకిస్తాన్లో స్థిరపడిన గఫార్ ఖాన్.. తన జీవితంలో దాదాపు 42 ఏండ్లు జైలులోని గడిపాడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1890 ఫిబ్రవరి 6 న జన్మించాడు. తండ్రి వ్యతిరేకించినప్పటికీ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. తదుపరి ఉన్నత చదువులను అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి పూర్తిచేశారు.
ఇరవై ఏండ్ల వయస్సులో తన స్వస్థలమైన ఉత్మాన్ జైలో గఫార్ ఖాన్ ఒక పాఠశాలను ప్రారంభించగా.. 1915 లో బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. తర్వాత మూడేండ్లపాటు అతను పష్టున్లలో అవగాహన కల్పించడానికి వందలాది గ్రామాల్లో పర్యటించాడు. దాంతో అతడ్ని ‘బాద్ షా ఖాన్’ అని పిలవడం మొదలుపెట్టారు. సామాజిక చైతన్యం కోసం ‘ఖుదాయ్ ఖిద్మత్గర్’ అనే సంస్థను కూడా స్థాపించాడు. ఈ సంస్థ అహింస, సత్యాగ్రహం వంటి మహాత్మా గాంధీ సూత్రాల స్ఫూర్తితో స్థాపించడం విశేషం. ఉప్పు సత్రాగ్రహం సమయంలో గఫార్ ఖాన్‌ను బ్రిటీష్ పోలీసులు అరెస్ట్ చేయగా.. దీనికి వ్యతిరేకంగా ‘ఖుదాయ్ ఖిద్మత్గర్’ వాలంటీర్లు ఆందోళనకు దిగారు. దాంతో వీరిపై పోలీసులు కాల్పులు జరుపగా దాదాపు 200 మంది చనిపోయారు.
భారతదేశ విభజనపై ఆలిండియా ముస్లిం లీగ్ మొండిగా ఉన్నప్పుడు, గఫార్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. 1947 జూన్ లో పష్టున్ల కోసం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేశాడు. కానీ ఈ డిమాండ్ నెరవేరలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇతడిని శత్రువుగా భావించి చాలా సంవత్సరాలపాటు జైలులో ఉంచింది. 1988 లో గృహ నిర్బంధంలో ఉండగానే ఆయన మరణించాడు. జీవితాంతం అహింసా మార్గాన్ని అనుసరించిన గఫార్ ఖాన్.. తన చివరి ప్రయాణం కూడా అహింసాత్మకంగా ఉండలేకపోయింది. అతడిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా రెండు పేలుళ్లు సంభవించగా.. దాదాపు 15 మంది మరణించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2010 : తొలిసారిగా సమ్మర్ యూత్ ఒలింపిక్స్ ప్రారంభం
2006 : ప్లూటో గ్రహం కాదని వెలువడిన అధికారిక ప్రకటన
1986 : బెనజీర్ భుట్టోను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్ హక్
1947 : భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజన
1935 : సామాజిక భద్రతా చట్టాన్ని ఆమోదించిన అమెరికా కాంగ్రెస్
1862 : బాంబో హైకోర్టు ప్రారంభం
ఇవి కూడా చదవండి..
నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు మోదీ తాతా..?!
హెలీకాప్టర్ తయారు చేశాడు.. రెక్క తగిలి చనిపోయాడు..
గ్యాస్ సబ్సిడీ అందట్లేదా..? ఇలా ప్రయత్నించండి!
చైనా, పాక్ సరిహద్దుల్లో ‘డేగకన్ను’
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

