Khalistan | అమెరికాలో మోదీకి నిద్రలేని రాత్రులే.. ఖలిస్థానీ గ్రూపు హెచ్చరిక
ఖలిస్థానీ ( Khalistan ) ఉగ్రవాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి హెచ్చరికలు జారీ చేసింది.

వాషింగ్టన్: ఖలిస్థానీ ( Khalistan ) ఉగ్రవాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో ఆయనకు నిద్రలేని రాత్రులే ఉంటాయని చెప్పింది. ఈ నెల 24న మోదీ అమెరికా వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఇలా హెచ్చరించింది. వైట్‌హౌజ్ ముందు కూడా నిరసనలకు ప్రణాళికలు రచించింది. తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతోపాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనడానికి మోదీ అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే. ఇండియాలో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్జే చెప్పింది. ఆ ఉగ్రవాద గ్రూపు జనరల్ కౌన్సిల్ గుర్పత్వంత్ సింగ్ పన్నన్ మాట్లాడుతూ.. అమెరికాలో తాను మోదీకి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తానని అనడం గమనార్హం.
అయితే ఈ గ్రూపుకు అంత సీన్ లేదని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు. అందులో పాకిస్థాన్, ముఖ్యంగా ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు కూడా ఉన్నాయి. అమెరికాలోనూ మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి కొంతమందిని కూడదీసే ప్రయత్నం చేస్తోంది అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ గ్రూపును ఇండియా జులై 10, 2019న నిషేధించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ యాప్‌ను అప్లోడ్ చేసి రెఫరెండం 2020కి రిజిస్టర్ చేసుకోవాలంటూ యూత్‌ను ఆకర్షించే ప్రయత్నం ఈ గ్రూపు చేస్తోంది.
లండన్‌లో ఆగస్ట్ 15న ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని గతేడాది ఈ గ్రూపు ప్రకటించినా.. తర్వాత కొవిడ్ కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఈ మధ్యే గుర్పత్వంత్ సింగ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని చెప్పడం గమనార్హం. ఒకవేళ యూకే, యూఎస్ఏ, యురోపియన్ యూనియన్ తాలిబన్లను గుర్తిస్తే.. తాము కూడా మద్దతు కోసం తాలిబన్లను కలుస్తామనీ ఇదే వీడియోలో గుర్పత్వంత్ చెప్పాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

