స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు
కెన్యాలో మత నాయకుడు పాల్ మెకంజీ, అతడి 30 మంది సహచరులు మతం పేరుతో పిల్లలకు ఆహారం ఇవ్వకుండా వారిని చనిపోయేలా చేసినందుకు దోషులుగా తేలారు. ప్రపంచం అంతమయ్యే లోపు తమను తాము ఆకలితో చంపుకొన్నవారు స్వర్గాన్ని చేరుకుంటారని మెకంజీ ప్రజలకు బోధించాడు. వాటి ప్రభావం వల్ల 190 మంది చిన్నారులు, ఒక వయోజనుడు చనిపోయారు. ఈ కేసులో నవంబర్ 6న శిక్షను ఖరారు చేయనున్నారు.
- కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
నైరోబి: కెన్యాలో మత నాయకుడు పాల్ మెకంజీ, అతడి 30 మంది సహచరులు మతం పేరుతో పిల్లలకు ఆహారం ఇవ్వకుండా వారిని చనిపోయేలా చేసినందుకు దోషులుగా తేలారు. ప్రపంచం అంతమయ్యే లోపు తమను తాము ఆకలితో చంపుకొన్నవారు స్వర్గాన్ని చేరుకుంటారని మెకంజీ ప్రజలకు బోధించాడు. వాటి ప్రభావం వల్ల 190 మంది చిన్నారులు, ఒక వయోజనుడు చనిపోయారు. ఈ కేసులో నవంబర్ 6న శిక్షను ఖరారు చేయనున్నారు. తాను నివసించే షాకహోల అడవిలో మెకంజీ ఈ మూఢ బోధనలకు పాల్పడ్డాడు. ఆ అడవిలో ఇప్పటి వరకు 400 శవాలను గుర్తించారు. క్రైస్తవం పేరుతో మెకంజీ గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ ద్వారా ఒక బృందాన్ని నడుపుతున్నాడు.
తాజా కేసుకు సంబంధించి తాను ఎవరినీ ఆకలితో ఉండాలని ఒత్తిడి చేయలేదని అతడు కోర్టుకు తెలిపాడు. ఆకలితో చస్తే స్వర్గం లభిస్తుందన్న అతడి బోధనల వివాదం మార్చి 2023లో మొదలైంది. అప్పుడు అతడిని ఒకసారి అరెస్ట్ చేసినా బెయిల్‌పై విడుదలయ్యాడు. పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా, అనారోగ్యానికి గురైనవారు దవాఖానకు వెళ్లకుండా మెకంజీ అడ్డుకొనేవాడు. ఆ సంస్థలు దయ్యాలతో అనుసంధానమై ఉంటాయని అభివర్ణించేవాడు. 2019లో అతడి చర్చ్‌ను అధికారులు మూసేస్తే అతడు షకహోల అడవికి వెళ్లిపోయాడు. 2017 నుంచి అతడి బోధనల పర్వం కొనసాగుతున్నా కెన్యా పోలీసులు, అధికారులు కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

