Justin Trudeau | 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దంపతులు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau) దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు.
టొరంటో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau) దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చింకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రాం వేదికగా వెళ్లడించారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్రీ ట్రుడో (Sophie Gregoire) దంపతులు ఇప్పటికే సంతకం చేశారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

2005, మే నెలలో జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయనియ తెలిపారు. కాగా, సోఫీ ఇప్పటికే ఒట్టావాలోని మరో నివాసానికి వెళ్లిపోయారని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రధాని పదవిలో ఉండగా భార్యకు విడాకులు ప్రకటించిన ప్రధానికిగా జస్టిన్ ట్రుడో నిలిచారు. మొదటి వ్యక్తి ఆయన తండ్రి పియెర్ ట్రుడో కావడం విశేషం.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

