Processed Food | ప్రాసెస్డ్ ఫుడ్‌తో 30కి పైగా రోగాలు.. అకాల మరణ ముప్పు పెరిగే ప్రమాదం!
తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొంటే క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. అంతే కాకుండా దీని వల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది.
Processed Food | సిడ్నీ, ఫిబ్రవరి 29: తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొంటే క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. అంతే కాకుండా దీని వల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది. పరిశ్రమల్లో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో విటమిన్లు, పీచు తక్కువగా, చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రేలియా, యూఎస్, ఫ్రాన్స్, ఐర్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల వల్ల కలిగే మరణ ముప్పు 50 శాతం పెరుగుతుందని సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ అధ్యయనంలో కోటి మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల డిప్రెషన్ పెరిగే అవకాశం 22 శాతం ఎక్కువని తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పాకెట్ల మీద వాటిలో అధిక పరిమాణంలో చక్కెరలు, కొవ్వులు ఉన్నాయని ముద్రించడం; స్కూళ్లు, దవాఖానల దగ్గర అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రచారం, అమ్మకాలు నిషేధించడం; అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా ప్రాసెస్ చేయని లేదా తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని డియాకిన్ యూనివర్సిటీ రిసెర్చ్ ఫెలో మెలిస్సా ఎమ్ లానే సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

