స్పేస్‌లో బెజోష్

- జెఫ్ బెజోస్ స్పేస్ టూర్ సూపర్ సక్సెస్
- మరో ముగ్గురితో కలిసి అంతరిక్ష విహారం
- రోదసిలోకి వెళ్లొచ్చిన అతిపెద్ద, పిన్న వయస్కులు
- పది నిమిషాల్లో అంతరిక్ష యాత్ర పూర్తి
వాన్ హార్న్, జూలై 20: బిలియనీర్స్ స్పేస్ రేస్‌లో మరో అడుగు పడింది. జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతం అయింది. మంగళవారం సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సస్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ క్రాఫ్ట్‌లోని క్యాప్సూల్‌లో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్, వాలీ ఫంక్(82), ఒలివర్ డేమన్(18)లు అంతరిక్షంలోకి వెళ్లారు. గంటకు 3,700 కిలోమీటర్ల వేగంతో(ధ్వని కంటే మూడు రెట్ల వేగం) దూసుకెళ్లిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ 76 కిలోమీటర్ల ఎత్తుకు చేరగానే బూస్టర్ నుంచి క్యాప్యూల్ విడిపోయింది. బూస్టర్ వెంటనే తిరిగి రాగా క్యాప్సూల్ అలాగే పైకి ప్రయాణిస్తూ కర్మన్ లైను (భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు) దాటింది. 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. అక్కడ ఈ నలుగురు భార రహిత స్థితిని అనుభవించారు. తర్వాత క్యాప్సూల్ పారాచూట్ల సాయంతో నేల మీద దిగింది. బెజోస్ యాత్ర 10 నిమిషాల్లో పూర్తి అయింది. క్యాప్సూల్ నేల మీదకు దిగిన తర్వాత అందులో నుంచే బెజోస్ విజయ సంకేతం చూపించారు. తన జీవితంలో ఇది ‘గొప్ప రోజు’ అని చెప్పారు.
రెండు రికార్డులు
బెజోస్ యాత్రలో రెండు విశేషాలు ఉన్నాయి. ఈ యాత్ర ద్వారా అతిపెద్ద వయసులో, అతిపిన్న వయసులో అంతరిక్షంలోకి వెళ్లి ఇద్దరు రికార్డు సృష్టించారు. ఒకరు వాలీ ఫంక్(82) కాగా, మరొకరు నెదర్లాండ్స్ విద్యార్థి ఒలివర్ డేమన్(18). 1960లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్న మెర్క్యురి-13 బృందంలో వాలీ ఫంక్ ఒకరు. ఆ ప్రాజెక్టు రద్దు కావడంతో అంతరిక్షంలోకి వెళ్లాలన్న ఆమె కల ఆలస్యం అయింది. ఒలివర్ డేమన్ రూ.209కోట్లతో ఈ యాత్రలో సీటు సంపాదించారు. అత్యంత చిన్న వయసులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
న్యూ షెపర్డ్‌లో మనుషులు ఇదే తొలిసారి
న్యూషెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌ను బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థనే తయారు చేసింది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో మానవులు ప్రయాణించడం ఇదే తొలిసారి. 2015 నుంచి ఇప్పటివరకు బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను 15 సార్లు పరీక్షించింది. అంతరిక్షంలోకి పంపించింది. అయితే అన్ని సార్లు మనుషుల్లేకుండానే ట్రయల్స్ జరిపింది. కానీ తాజాగా మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి బ్రాన్సన్, ఆయన బృందం వెళ్లిన విమానాన్ని పైలట్లు నడుపాల్సి ఉండగా, న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్యూల్ పూర్తిగా దానంతట అదే నడుస్తుంది. పైలట్లు అవసరం లేదు. బ్రాన్సన్ వెళ్లినదానికన్నా 16 కిలోమీటర్ల ఎత్తులోకి బెజోస్ వెళ్లారు.
బ్రాన్సన్ వర్సెస్ బెజోస్
అంతరిక్షయానం కోసం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇప్పటికే టికెట్ల రేటు ఖరారు చేసింది. ఒక్కో టికెట్ రూ.1.86 కోట్లు అని ప్రకటించింది. ఇప్పటికే 600 మంది రిజర్వేషన్ చేసుకొన్నారు. వచ్చే ఏడాది నుంచి కస్టమర్లను అంతరిక్షానికి తీసుకెళ్లనున్నారు. ఈలోగా మరో రెండు ప్రయోగాత్మక యాత్రలను నిర్వహించాలని భావిస్తున్నారు. బ్లూ ఆరిజిన్ ఇంకా ధర వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

