కెనడా ఎన్నికల్లో 17 మంది భారతీయ సంతతి ఎంపీల విజయం

మాంట్రియల్: కెనడా ప్రధానిగా మూడవసారి జస్టిన్ ట్రూడో ఎన్నికయ్యారు. లిబరల్ పార్టీ మెజార్టీ సాధించకున్నా.. ఆ పార్టీయే అధికారాన్ని చేపట్టనున్నది. అయితే ఈసారి కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ 27 సీట్లు గెలిచి కీలకంగా మారింది. జగ్మీత్ మద్దతులోనే ట్రూడో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మాజీ మంత్రులు టిమ్ ఉప్పల్, హర్జిత్ సింగ్ సజ్జన్, బర్దిశ్ చాగర్, అనితా ఆనంద్‌లు కూడా మళ్లీ ఎన్నికయ్యారు. వాంకోవర్ నుంచి రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ రెండోసారి గెలిచారు. వాటర్లూ సీటు నుంచి ఛాగర్ విజయం సాధించారు. బ్రిటీష్ కొలంబియా నుంచి సుఖ్ దలివాల్, సర్రీ సెంటర్ నుంచి రణ్‌దీప్ సింగ్ సారాయి గెలిచారు. క్యుబెక్ నుంచి ఇండో కెనడియన్ అంజూ ధిల్లాన్ మరోసారి ఎంపీ అయ్యారు. కాల్గరి ఫారెస్ట్ లాన్ స్థానం నుంచి జస్రాజ్ సింగ్ హల్లన్ విక్టరీ కొట్టారు. ఎడ్మంటన్ మిల్ వుడ్స్ నుంచి ఉప్పల్ మరోసారి గెలుపొందారు. ఒంటారియాలో నలుగురు సిట్టింగ్ ఇండో కెనడియన్లు విజయం సాధించారు. ఎంపీలు మణిందర్ సిద్దూ, రూబీ సహోటా, సోనియా సిద్దు, కమల్ ఖేరాలు గెలిచారు. నేపియన్ సీటు నుంచి చంద్ర ఆర్యా విజయం సాధించారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

