జాహ్నవికి మరణానంతరం డిగ్రీ
అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
వాషింగ్టన్: అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి 2021లో సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా మితిమీరిన వేగంతో వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ఆమె మృతి చెందారు. జాహ్నవి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన యూనివర్సిటీ వీసీ ఆమెకు మరణాంతరం డిగ్రీ ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
జాహ్నవికి న్యాయం చేయాలి..
జాహ్నవి మరణం తర్వాత పోలీస్ అధికారి డానియల్ ఆడెరర్ జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడిన వీడియో ఇటీవల బయటపడింది. దీనిపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జాహ్నవి కందులకు న్యాయం చేయాలని, సియాటిల్ పోలీస్ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 200 మందికిపైగా విద్యార్థులు జాహ్నవి ప్రమాదానికి గురైన స్థలం వద్ద గురువారం ర్యాలీ నిర్వహించారు. జాహ్నవి మృతిపై సీరియస్గా దర్యాప్తు జరుపాలని ఇండో అమెరికన్ చట్టసభ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

