డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె వయసు 73 ఏళ్లు. న్యూయార్క్ సిటీలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్ మృతిచెందినట్లు డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆమె ఓ అద్భుతమైన, అందమైన మహిళ అని, ప్రేరణాత్మక జీవితాన్ని ఆమె గడిపినట్లు డోనాల్డ్ ట్రంప్ తన పోస్టులో తెలిపారు. ఇవానా ట్రంప్‌కు జూనియర్ డోనాల్డ్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ అనే పిల్లలు ఉన్నారు. వారంటే ఆమెకు ఎంతో ఇష్టమని, ఆమె ఎంతో గర్వపడేదని, ఇవానా రెస్ట్ ఇన్ పీస్ అంటూ తన పోస్టులో డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చెకస్లోవేకియాకు చెందిన మాజీ మోడల్ అయిన ఇవానాను 1977లో డోనాల్డ్ పెళ్లి చేసుకున్నారు. డోనాల్డ్, ఇవానా ట్రంప్‌లు 90 తొలి నాళ్లలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1993లో మేపల్స్ను డోనాల్డ్ పెళ్లి చేసుకున్నారు. వారి దాంపత్యం 1999 వరకు సాగింది. ఆ తర్వాత 2005లో మెలానియా ట్రంప్‌ను డోనాల్డ్ పెళ్లాడారు. ఇవానా ట్రంప్ వ్యక్తిగతంగా మేటి వ్యాపారి. క్లాతింగ్, జ్వలరీ, బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఆమె వ్యాపారం నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

