ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా విలయం: డబ్ల్యూహెచ్‌వో సైంటిస్ట్

న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వ్యాపించే ఆ వేరియంట్ వల్లే ఇండియాలో ఇంతటి కరోనా విలయం ఏర్పడిందని అన్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. ఈ వేరియంట్ వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఎఫ్పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. కరోనాకు చెందిన B.1.617 వేరియంటే ఈ విపత్తుకు కారణమని ఆమె స్పష్టం చేశారు. దీనిని తొలిసారి ఇండియాలోనే గతేడాది అక్టోబర్‌లో గుర్తించారు. దీనిని ఒక ప్రత్యేకమైన వేరియంట్‌గా డబ్ల్యూహెచ్‌వో కూడా ఈ మధ్య లిస్ట్ చేసింది.
ఇప్పటి వరకూ కరోనా వ్యాప్తిని పెంచిన వేరియంట్లు ఎన్నో ఉన్నాయని, అందులో ఇదీ ఒకటని సౌమ్య చెప్పారు. అయితే దీనిని ఇప్పటి వరకూ ఆందోళన కలిగించే వేరియంట్‌గా మాత్రం డబ్ల్యూహెచ్‌వో గుర్తించలేదు. ఈ ముద్ర పడిందంటే ఇది ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని, చాలా ప్రమాదకరమైందని, వ్యాక్సిన్లనూ బోల్తా కట్టిస్తుందని అర్థం. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాలు దీనిని ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించగా.. త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో కూడా గుర్తిస్తుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.
సహజంగా లేదా వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన యాంటీబాడీలను కూడా బోల్తా కొట్టించే కొన్ని మ్యుటేషన్లు ఈ B 1.617 వేరియంట్లో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. అందుకే దీనిని ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించవచ్చని తెలిపారు. అయితే ఈ వేరియంట్‌దే మొత్తం బాధ్యత అని చెప్పలేమని, కరోనా వెళ్లిపోయిందని బాధ్యరహితంగా తిరిగారని, అందువల్లే ఈ విపత్తు అని ఆమె అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

