Israel-Hamas War | గాజాస్ట్రిప్‌పై అణుబాంబు ప్రయోగానికీ వెనుకాడం.. ఆప్షన్‌గా పెట్టుకున్నామన్నఇజ్రాయెల్ మంత్రి అమిచాయ్
హమాస్‌ను అంతమొందించేందుకు.. గాజాస్ట్రిప్‌పై పట్టు సాధించేందుకు ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగించడానికి కూడా సిద్ధమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- ప్రభుత్వ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన నెతన్యాహూ
- శరణార్థి శిబిరంపై బాంబు దాడి.. 40 మంది మృతి!
Israel-Hamas War | జెరూసలేం, నవంబర్ 5: హమాస్‌ను అంతమొందించేందుకు.. గాజాస్ట్రిప్‌పై పట్టు సాధించేందుకు ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగించడానికి కూడా సిద్ధమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ మంత్రి అమిచాయ్ ఇలియాహు రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘పరిస్థితులు అనుకూలించకపోతే గాజాస్ట్రిప్‌పై అణుబాంబు వేయటమొక్కటే ఆప్షన్’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార, విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు మంత్రిని ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొనకుండా నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాల్ని గౌరవిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, శనివారం రాత్రి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జరిపిన బాంబు దాడుల్లో గాజాలోని మఘాజి శరణార్థుల శిబిరం ధ్వంసమైంది. ఈ ఘటనలో కనీసం 40మంది పౌరులు చనిపోయారని, మృతుల్లో 8 మంది చిన్నారులున్నారని, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 3,900 మంది చిన్నారులు చనిపోయారని, 8,067మంది గాయపడ్డారని హమాస్ నేతృత్వంలోని గాజా ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ప్రతి 10 నిమిషాలకు ఒక చిన్నారి మృత్యువాత పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

