Omicron | ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
Omicron |

జెరూసలేం : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్నది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాలో మరణాలు నమోదవగా.. తాజాగా ఇజ్రాయెల్‌లో ఒమిక్రాన్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని దేశ అధికారులు ధ్రువీకరించారు. దక్షిణ నగరమైన బీర్షెబాలోని సోరోకా హాస్పిటల్లో 60 సంవత్సరాల వ్యక్తి ఆసుపత్రిలో చేరిన రెండు వారాల తర్వాత సోమవారం మరణించాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఇంతకు ముందు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడ్డాడని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించేందుకు కసరత్తులు చేస్తున్నది. వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు నాల్గో డోస్ ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ అధికారుల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మంగళవారం పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రజలకు విస్తృతంగా టీకాలు వేసింది. ఆ తర్వాత బూస్టర్ డోస్ సైతం అందించిన దేశంగా నిలిచింది. 9.3 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో కొవిడ్ కారణంగా 8,200 మంది మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

