Israel | యుద్ధం అంచున ఇజ్రాయెల్-హెజ్బొల్లా! రాకెట్ దాడిలో 12 మంది పిల్లల మృతితో పెరిగిన ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి.
- హెజ్బొల్లా గ్రూపు స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు
- భారీ మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని నెతన్యాహూ హెచ్చరికలు
దుబాయ్/న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడికి ప్రతిగా హెజ్బొల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. మరిన్ని దాడులు ఉంటాయని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తు చర్యలపై ఇజ్రాయెల్ చర్చలు రాకెట్ దాడికి హెజ్బొల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆయన సెక్యూరిటీ క్యాబినెట్, సైనిక ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు లెబనాన్ భూభాగంపై ఇజ్రాయెల్ పాల్పడే సైనిక చర్యలు ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నదని ఇరాన్ అభిప్రాయపడింది.
లెబనాన్‌లోని భారత పౌరులకు అడ్వైజరీ
లెబనాన్‌లో ఉంటున్న భారత పౌరులకు బీరుట్‌లోని భారత ఎంబసీ సోమవారం అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమయంలో ఫోన్ నంబర్+96176860128, మెయిల్ ఐడీ cons.beirut@mea.gov.inను సంప్రదించాలని సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

