Ireland | పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా ఐర్లాండ్ గుర్తింపు.. నేడు ప్రకటించనున్న ప్రధాని హారిస్!
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ (Ireland) ప్రభుత్వం నిర్ణయించింది.
డబ్లిన్: ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ (Ireland) ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని సైమన్ హారిస్, విదేశాంగ మంత్రి మిచెల్ మార్టిన్ బుధవారం ప్రకటించనున్నారు. గతేడాది ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగుతున్నది. హమాస్‌కు ప్రధాన కేంద్రంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. దీంతో అక్కడున్న ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. నెతన్యాహ్యూ సేనల దాడుల్లో వేల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి చిగురించాలని పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదీ కల్పించడమే పరిష్కారమని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఐర్లాండ్, స్పెయిన్, స్లొవేనియా, మాల్టా పాలకులు పాలస్తీనాను దేశంగా గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనిపై మే 21న ఓ ప్రకటన వెలువడుతుందని యూరోపియన్ యూనియన్ విదేశాంగ పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ గతవారం వెల్లడించారు. అదేవిధంగా ఈ నెలాఖరులోగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం ఖాయమని ఐర్లాండ్ విదేశాంగ మంత్రి మిచెల్ మార్టిన్ ఈ నెల 17న తెలిపారు. ఇందులో భాగంగానే నేడు ప్రకటన వెలువడనుంచి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్యదేశాల్లో 137 దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. పాలస్తీనాకు ఈయూ దేశాల మద్దతు లభించినప్పటికీ ఫ్రాన్స్, జర్మనీ నుంచి మద్దతు దొరకట్లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

