‘జన గణ మన’.. ఈ గీతం వినిపించగానే భారతీయుల హృదయాలు జాతీయత, దేశభక్తితో నిండిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ‘జన గణ మన’ అని ఎక్కడా, ఎవరు పాడినా కోరస్ కలుపుతారు. విదేశీ గాయకులు కూడా మన జాతీయ గీతాన్ని పాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఓ విదేశీయురాలు మన జాతీయ గీతాన్ని వీనుల విందుగా సితార్ పై వాయించి ప్రశంసలు అందుకున్నది. ఇరాన్‌కు చెందిన ఓ అమ్మాయి సంతూర్‌పై (Iranian Girl) మన జాతీయ గీతాన్ని అందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
ఐఎఫ్ఎస్ అధికారి సుధా రామెన్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. తారా ఘహ్రేమణి అనే ఇరాన్ అమ్మాయి గులాబీ రంగు దుస్తులు ధరించి చిరునవ్వుతో సంతూర్ వాయించింది. ఆమె మాదిరిగానే ‘జన గణ మన’ గీతాన్ని సితార్‌పై ప్లే చేసింది. ‘ఏ రూపంలో వినిపించినా జాతీయ గీతం మాకు గూస్ బంప్స్ ఇస్తుంది. ఈ అందమైన ప్రదర్శన ఇచ్చిన ఈ ఇరానియన్ అమ్మాయికి ధన్యవాదాలు’ అని సుధా రామెన్ రాశారు. ఈ వీడియోను ఒక్కరోజులోనే వేలాది మంది వీక్షించగా.. పెద్ద సంఖ్యలో రీట్వీట్ అయ్యింది.
సోషల్ మీడియాలో జాతీయ గీతం కొత్త రికార్డు.. అదేంటంటే..?
ముంబై ఇండియన్స్‌కు వెరైటీగా అనౌన్స్మెంట్
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
లండన్‌లో క్రికెటర్ల జెండా పండుగ
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
ఢిల్లీలోని హోటల్లో మంటలు.. ఇద్దరు మృతి
ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
ఇండియన్స్‌కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్‌లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..