మీ దేశాల నుంచి అమెరికన్లను బహిష్కరించండి
ఒక పక్క అగ్రరాజ్యం అమెరికాతో తీవ్రంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఇరాన్.. మరో వైపు గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని అమెరికన్లందరినీ తమ ప్రాంతాల నుంచి వెంటనే బహిష్కరించాలని, తమ దేశంలోని అమెరికా మిలిటరీ స్థావరాలను పూర్తిగా తొలగించాలని హెచ్చరించింది.
- అమెరికా బేస్‌లను తొలగించండి -గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్: ఒక పక్క అగ్రరాజ్యం అమెరికాతో తీవ్రంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఇరాన్.. మరో వైపు గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని అమెరికన్లందరినీ తమ ప్రాంతాల నుంచి వెంటనే బహిష్కరించాలని, తమ దేశంలోని అమెరికా మిలిటరీ స్థావరాలను పూర్తిగా తొలగించాలని హెచ్చరించింది.
ఈ మేరకు ఇరాన్ ఎంపీ ఒకరు టెహ్రాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ‘ఇరాన్ క్షిపణుల ముప్పు తప్పాలని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ ఒమన్, ఖతార్, బహ్రెయిన్, తుర్కియే, ఇతర దేశాల నేతలు భావిస్తుంటే, వారు వెంటనే తమ ప్రాంతాల్లోని అమెరికన్లను బహిష్కరించాలి, తమ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‌లను తొలగించాలి’ అని పేర్కొన్నారు. యుద్ధంలో 1,230 మంది ఇరానియన్లు మృతి చెందారని ఆ దేశ సంస్థ ఒకటి తెలిపింది. ఇరాన్, లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా నుంచి గురువారం తమ దేశంపై పలుచోట్ల దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ప్రకటించింది.
కాగా, 130 మంది సిబ్బందితో భారత నౌకాదళానికి అతిథిగా ఉన్న నౌక దేనాను అంతర్జాతీయ జలాల్లో హెచ్చరిక లేకుండా దాడిచేసి ముంచడం ‘సముద్రంలో దారుణం’గా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘి బుధవారం ఖండించారు. గల్ఫ్‌లోని ఉత్తర ప్రాంతంలో ఒక యూఎస్ ట్యాంకర్‌ను ఢీకొట్టామని, ఒక నౌకకు నిప్పు పెట్టామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ గురువారం తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

