దుబాయ్: తమ మిలటరీ కమాండర్ ఖాసీం సోలిమనిని చంపినందుకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమారుస్తామని ఇరాన్ హెచ్చరించింది. శుక్రవారం రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమిరాలి హజీజాదె మాట్లాడుతూ 1,650 కిలోమీటర్ల పరిధి నూతన క్షిపణితో తమ ఆయుధ సామర్థ్యం పటిష్ఠమైందని తెలిపారు. 2020లో అమెరికా డ్రోన్లతో దాడి చేసి ఖాసీంను హతమార్చిందని, ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్, అమెరికా సెక్రటరీ మైక్ పాంపియో, మిలటరీ కమాండర్లను కూడా చంపేస్తామని హెచ్చరించారు.