Indian Students | లండన్, ఆగస్టు 9: కఠినతరమైన వీసా నిబంధనలు, వలసదారులపై ఆందోళనల కారణంగా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ (హెచ్ఈఎస్ఏ) గురువారం విడుదల చేసిన డాటా ప్రకారం 2022-23 విద్యా సంవత్సరంలో మిగిలిన దేశాల విద్యార్థుల కన్నా మనదేశ విద్యార్థులే అధికంగా యూకేకు వెళ్లారు. 2018-19 నుంచి చూస్తే మొత్తం మీద భారత విద్యార్థుల సంఖ్య 1,45,650కి పెరిగింది.
అయితే ఇటీవల వలసదారులను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనలు, హింస కారణంగా విద్యార్థులకు ఆ దేశంపై ఆసక్తి తగ్గింది. నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులు వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. స్టూడెంట్ వీసాల సంఖ్య 16 శాతం, డిపెండెంట్ వీసా దరఖాస్తులు 81% తగ్గినట్టు ఆ లెక్కలు వెల్లడించాయి.