Indian student in UK | చదువు కోసం బ్రిటన్ వెళ్లాడు.. మద్యం మత్తులో ఉన్న యువతిని ఫ్లాట్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు
Indian student in UK | చదువు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థి (Indian student in UK) మద్యం మత్తులో ఉన్న ఒక యువతిని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, ఏడాదిపాటు విచారణ జరిపిన కోర్టు అతడికి ఆరేళ్లకుపైగా జైలు శిక్ష విధించింది.
లండన్: చదువు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థి (Indian student in UK) మద్యం మత్తులో ఉన్న ఒక యువతిని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, ఏడాదిపాటు విచారణ జరిపిన కోర్టు అతడికి ఆరేళ్లకుపైగా జైలు శిక్ష విధించింది. బ్రిటన్‌లోని కార్డిఫ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది జూన్ 4న తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక క్లబ్ వద్ద మద్యం మత్తులో ఉన్న యువతిని భారతీయ విద్యార్థి అయిన 20 ఏళ్ల ప్రీత్ వికాల్ చూశాడు. పరిచయం లేని ఆ యువతిని ఎత్తుకుని సమీపంలో ఉన్న తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. ఆమెను బెడ్‌పై పడుకోబెట్టి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, మద్యం మత్తు దిగిన తర్వాత తన శరీరంపై దుస్తులు లేకపోవడం, బ్లీడింగ్‌ను ఆ యువతి గమనించింది. బెడ్ నుంచి దిగి దుస్తులు వేసుకుంది. ప్రీత్ వికాల్ ఇన్స్టాగ్రామ్ గురించి అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య శృంగారం జరిగిందా అంటూ ఆ యువతి మెసేజ్ పంపింది. ఒకవేళ జరిగి ఉంటే గర్భ నిరోధక జాగ్రత్తలు తీసుకున్నామా? అని అడిగింది. తమ మధ్య శృంగారం జరిగినట్లు ప్రీత్ బదులిచ్చాడు. అయితే సురక్షిత లైంగిక పద్ధతులు పాటించలేదని చెప్పాడు. మరునాడు ఆ యువతి ఫొటోను తన స్నేహితుడికి ప్రీత్ పంపాడు. కండోమ్ వాడటాన్ని మరిచిపోయినట్లు చాట్‌లో పేర్కొన్నాడు.
మరోవైపు మద్యం మత్తులో ఉన్న తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆ యువతి గ్రహించింది. పోలీసులను ఆశ్రయించి ప్రీత్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. కాగా, యువతి అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నట్లుగా కోర్టులో వాదించేందుకు ప్రీత్ ప్రయత్నించాడు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న యువతి దానికి ఎలా సమ్మతి తెలుపుతుందని ప్రాసిక్యూటర్ ప్రశ్నించారు. ఆమెను ఎంతో కష్టంగా ఫ్లాట్‌కు ప్రీత్ తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించారు. అలాగే బాధితురాలి మెసేజ్‌లకు అతడు ఇచ్చిన రిప్లై టెక్ట్స్‌ను కూడా కోర్టు ముందుంచారు. దీంతో చివరకు తన తప్పును ప్రీత్ ఒప్పుకున్నాడు. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు.
కాగా, ప్రీత్ వికాల్, ఉత్తర ఢిల్లీలోని మారుమూల గ్రామానికి చెందిన యువకుడని అతడి తరుఫు న్యాయవాది లూయిస్ స్వీట్ కోర్టుకు తెలిపారు. బ్రిటన్‌లో ఇంజినీరింగ్ చదివేందుకు స్కాలర్షిప్ కూడా పొందాడని, ఎంతో కష్టపడి చదువుతున్నాడని చెప్పారు. అతడి కుటుంబం నుంచి యూనివర్సిటీకి వెళ్లిన ఏకైక వ్యక్తి ప్రీత్ అని అన్నారు. అలాగే అతడి గ్రామం నుంచి విదేశాల్లో చదువుతున్న ఏకైక విద్యార్థి అని పేర్కొన్నారు. బ్రిటన్‌లో చదువుకోవాలన్న తన కలతోపాటు జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న తల్లిదండ్రుల కలను నెరవేర్చేందుకు ప్రీత్ కృషి చేస్తున్నాడని, చదువులో స్టార్ అని అభివర్ణించారు.
మరోవైపు ఏడాదిపైగా కొనసాగిన ఈ కేసు విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడు ప్రీత్ వికాల్ను దోషిగా నిర్ధారించింది. అతడికి ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు జైలు శిక్ష విధించింది. సుమారు నాలుగేళ్ల పాటు యువ నేరస్థుల సంస్థ కస్టడీలో జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది.
Preet Vikal, 20 ans, étudiant en ingénierie a transporté une jeune femme inconsciente, qu'il ne connaissait pas dans sa chambre après une soirée dans un club à Cardiff. Le lendemain il a dit qu'elle était consentante. https://t.co/01MJOnaumI https://t.co/oLGNEaQHM4 pic.twitter.com/qaGQHNd1Ai
— Euphorie 🫧 (@_Oct14th) June 17, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

