తలలు అతుక్కొని పుట్టిన ఇజ్రాయెల్ కవలల సర్జరీకి.. భారతీయ సంతతి వైద్యుడి సహకారం

జెరుసలెం: తలలు అతుక్కొని పుట్టిన ఇజ్రాయెల్ కవలల సర్జరీకి భారతీయ సంతతికి న్యూరోసర్జన్ డాక్టర్ నూర్ ఉల్ ఓవాసే జిలానీ తన వంతు సహకారం అందించారు. ఏడాదిగా ఈ ఇద్దరి తలల వెనుక భాగాలు కలిసే ఉన్నాయి. డాక్టర్లు 12 గంటల పాటు సర్జరీ చేసి ఇటీవల విజయవంతంగా వేరు చేశారు. దీని కోసం డాక్టర్ల బృందం ఎంతో శ్రమించింది.

జమ్ముకశ్మీర్‌లో జన్మించిన నూర్ ఉల్ ఓవాసే జిలానీ, లండన్‌లోని గ్రేట్ ఓర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని సోరోకా ఆసుపత్రి వైద్యులు సంప్రదించారు. బ్రిటన్ వెలుపల అటువంటి శస్త్రచికిత్స చేయడానికి ఆయన అంగీకరించడం ఇదే మొదటిసారి అని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ (TOI) తెలిపింది. జిలానీ, ఆయన సహోద్యోగి, ప్రొఫెసర్ డేవిడ్ డన్వే ప్రపంచవ్యాప్తంగా అటువంటి కేసులలో ఎంతో నిఫుణులని వెల్లడించింది.

డాక్టర్ కోణంలో మనమంతా ఒక్కటే: జిలానీ
‘ఒక యూదు కుటుంబానికి సహాయం చేయడానికి కశ్మీర్లో జన్మించిన ముస్లిం వైద్యుడు ఇజ్రాయెల్ బృందంతో కలిసి కవల పిల్లల తలలు విడదీసే సర్జరీకి సహకరించడం వైద్యం యొక్క సార్వత్రిక స్వభావాన్ని గుర్తు చేస్తుంది’ అని ఆయన జిలానీ అన్నారు. ‘రంగు, మతం వంటి వ్యత్యాసాలు మానవులు సృష్టించుకున్నవే. పిల్లలు పిల్లలే. డాక్టర్ కోణం నుంచి మనమంతా ఒక్కటే’ అని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత పిల్లల తల్లి భావోద్వేగాన్ని అదుపు చేయడం తమకు కష్టంగా అనిపించిందని చెప్పారు.
.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

