ఫెడెక్స్ సీఈవోగా రాజ్ సుబ్రమణియమ్
న్యూయార్క్: అంతర్జాతీయ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడెక్స్కు భారతీయ సంతతికి చెందిన రాజ్ సుబ్రమణియమ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చైర్మెన్, సీఈవో ఫ్రెడ్రిక్ వి స్మిత్ స్థానంలో రాజ్ సుబ్రమణియమ్ ఆ బాధ్యతలు తీసుకుంటారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఫ్రెడ్రిక్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇక తాను బోర్డు పరిపాలనపై దృష్టి పెట్టనున్నట్లు స్మిత్ తెలిపారు. ఫ్రెడ్రిక్ ఓ విజినరీ నేత అని, వ్యాపార ప్రపంచంలో అతనో లెజెండ్ అని, ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీని ఆయన స్థాపించారని, ఆయన బాధ్యతలను స్వీకరించడం గౌరవంగా భావిస్తానని సుబ్రమణియమ్ ఓ ప్రకటనలో చెప్పారు. టెన్నిసెసీలో ఫెడెక్స్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ కంపెనీలో సుమారు ఆరు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2020లో ఫెడెక్స్ బోర్డు ఆఫ్ డైరక్టర్స్కు సుబ్రమణియం ఎంపికయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

