డిస్కౌంట్లో ఇంధనం కొనడం ఆంక్షల ఉల్లంఘన కాదు.. కానీ
వాషింగ్టన్: రష్యా వద్ద డిస్కౌంట్లో చమురును కొనుగోలు చేసేందుకు ఇండియా సిద్ధమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై అమెరికా స్పందించింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైట్‌హౌజ్ ప్రతినిధి జెన్ సాకి సమాధానం ఇచ్చారు. రష్యా చమురును డిస్కౌంట్లో ఇండియా కొనడం ఆంక్షల ఉల్లంఘన కాదు అని, కానీ అలాంటి చర్య చేపడితే అప్పుడు చరిత్రలో భారత్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లగా భావించాల్సి వస్తుందని ఆమె అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యా.. తన వద్ద చమురుతో పాటు ఇతర వస్తువుల్ని ఇండియాకు తక్కువ ధరకు అమ్మేయాలనుకుంటోంది.
రష్యా వద్ద డిస్కౌంట్ ఆఫర్లో చమురు కొనుగోలు చేయాలని కూడా భారత్ భావిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. చమురు ఖరీదు చేయడం ఉల్లంఘన కాదు అని, కానీ మీ స్థానం ఎక్కడో ఆలోచించాల్సి ఉంటుందని, ఇలాంటి సమయంలో రష్యాకు మద్దతు ఇవ్వడం అంటే చరిత్రలో మీరెవ్వరి వైపు నిలబడ్డారో అర్థం అవుతుందని సాకి అన్నారు. రష్యా వద్ద ఆయిల్‌ను కొనడం అంటే ఆ దేశం చేపట్టిన దండయాత్రకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని అమెరికా ఆరోపించింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై దాడిని ఇండియా ఖండించలేదు. యూఎన్ భేటీలోనూ ఓటింగ్‌కు దూరంగా ఉంది.
వారం క్రితం రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నోవాక్.. భారత పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ పురితో ఫోన్లో మాట్లాడారు. ఇండియాకు ఆయిల్ ఎగుమతుల్ని పెంచేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య వాణిజ్యం బిలియన్ డాలర్లు దాటింది. ఈ నేపథ్యంలో వాణిజ్యాన్ని మరింత పెంచాలని భావిస్తున్నట్లు రష్యా చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

