Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Riyadh airport | సౌదీఅరేబియా (Saudi Arabia) రాజధాని నగరం రియాద్ (Riyad) లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు (International Airport) పై జరిగిన క్షిపణి దాడి (Missile Attack) ని భారత్ (India) తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోవడమేగాక 300 మందికిపైగా గాయపడటంపట్ల విచారం వ్యక్తంచేసింది.
Riyadh airport : సౌదీఅరేబియా (Saudi Arabia) రాజధాని నగరం రియాద్ (Riyad) లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు (International Airport) పై జరిగిన క్షిపణి దాడి (Missile Attack) ని భారత్ (India) తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోవడమేగాక 300 మందికిపైగా గాయపడటంపట్ల విచారం వ్యక్తంచేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిపే ఇలాంటి దాడులు మళ్లీమళ్లీ పునరావృతం కావడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ (Indian Foreign Ministry) వ్యాఖ్యానించింది.
గత దశాబ్ద కాలంలో సౌదీగడ్డపై జరిగిన అత్యంత భయానక దాడిగా తాజా దాడిని భావిస్తున్నారు. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాల కోసం కేటాయించిన టెర్మినల్స్ 3, 4 ఉన్న ప్రాంతంలో ఈ క్షిపణి దాడి జరిగింది. అక్టోబర్ 10న జరిగిన ఈ దారుణ ఘటనతోపాటు గత కొన్ని రోజులుగా రియాద్ విమానాశ్రయంపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ‘పౌరులపై దాడులను తక్షణమే నిలిపివేయాలి’ అని ఆ ప్రకటనలో డిమాండ్ చేసింది.
సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ అండగా నిలుస్తుందని విదేశాంగశాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించింది. ఈ దాడి వెనుక యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారుల హస్తం ఉందని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఆరోపించాయి. మృతుల్లో సౌదీ, బంగ్లాదేశ్, పాలస్తీనా, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, సూడాన్ పౌరులు ఉన్నారు. ఈ వారంలో రియాద్ విమానాశ్రయంపై ఇది మూడో దాడి కావడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

