Watch: రాతి శిల్పం కాదు, సాగే కాగిత శిల్పం.. అద్భుత కళాఖండం
వ్యక్తి మెడ భాగం వరకు ఉన్న ఈ కళాఖండం చూసేందుకు అచ్చం రాతి శిల్పంగా ఉంటుంది. ఆర్టిస్ట్ ఫెలిక్స్ దీని తల భాగాన్ని సాగదీయడంతోపాటు పలు కోణాల్లో దానిని వంచుతారు.
వాషింగ్టన్: ఒక కళాకారుడు రూపొందించిన కళాఖండం ఎంతో ఆకట్టుకుంటున్నది. చూసేందుకు రాతి శిల్పంలా ఉండే ఇది వాస్తవంగా సాగే విధంగా కాగితంతో తయారైంది. ప్రసిద్ధ క్యూబా అమెరికన్ కళాకారుడు ఫెలిక్స్ సెంపర్ దీనిని రూపొందించారు. ఒక వ్యక్తి మెడ భాగం వరకు ఉన్న ఈ కళాఖండం చూసేందుకు అచ్చం రాతి శిల్పంగా ఉంటుంది. ఆర్టిస్ట్ ఫెలిక్స్ దీని తల భాగాన్ని సాగదీయడంతోపాటు పలు కోణాల్లో దానిని వంచుతారు. తన ప్రతిభతో ఇలా సాగే విధంగా కాగితంతో దీనిని తయారు చేశారు. ఈ అద్భుత కాగిత శిల్పం ఎంతో ఆకట్టుకుంటున్నది.
కాగా, అసాధారణంగా సాగే ఈ కాగితపు శిల్పం వీడియోను ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 60 లక్షల మంది ఈ వీడియోను చూశారు. సుమారు లక్ష మంది దీనిని లైక్ చేశారు. అద్భుత కళాఖండం అంటూ నెటిజన్లు ప్రశంసించారు. ఊహకు అతీతమైన ఆర్ట్ అంటూ ఒకరు కొనియాడారు. మానవ మనస్సును ఉత్తేజపరిచడంతోపాటు ప్రేరేపించే శక్తి కళకు ఉందని మరొకరు పేర్కొన్నారు.
https://twitter.com/fasc1nate/status/1610161273181802499?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1610161273181802499%7Ctwgr%5E55d61611a1d5d16c31bb805c7d2462f09bf9501c%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Ffeature%2Fwatch-this-incredible-stretchable-paper-sculpture-will-blow-your-mind-3674056
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

