సోషల్ మీడియా యాక్సిస్ ఇస్తే ఒట్టు.. కొత్త ప్రధానిని ఇబ్బందులు పెడుతున్న ఇమ్రాన్
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయి.. నాలుగు రోజులైంది. పాక్ నూతన ప్రధానిగా షాహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు కూడా. షాహబాజ్ ఎన్నికైనా… ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాపై తన ఆధిపత్యాన్ని సడలించుకోవడం లేదు. పీఎంవో కార్యాలయ ట్విట్టర్ హ్యాండిల్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల అకౌంట్లను ప్రస్తుత ప్రధానికి బదిలీ చేయకుండా మంకుపట్టు పడుతున్నారు.
నూతన ప్రధానిగా షాహబాజ్ ఎన్నికైనా…. మాజీ ప్రధాని ఇమ్రాన్ మాత్రం సోషల్ మీడియా అకౌంట్లను వారికి బదిలీ చేయకుండా ఆపేస్తున్నారని, అసలు యాక్సిస్ ఇవ్వడం లేదని పాక్ మీడియా పేర్కొంది. పీఎంవో అధికారిక ట్విట్టర్ పేజీ అందుబాటులో లేకపోవడంతో నూతన ప్రధాని షాహబాజ్ ఓ కొత్త ట్విట్టర్ పేజీనే సృష్టించుకున్నారు. దానికి @pmo_pk ఐడీ పెట్టారు. పీఎంవో అధికార ట్విట్టర్‌తో సహా.. ఇతర సోషల్ మీడియా అకౌంట్లను బదిలీ చేసేందుకు మాజీ ప్రధాని ఇమ్రాన్ నిరాకరిస్తున్నారు.
గతంలో పీఎంవో ట్విట్టర్ అకౌంటర్ @pakpmo పేరు మీద ఉండేది. దీనిని పాక్ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇమ్రాన్ గజాలీ అనే అధికారి చూసేవారు. దీనికి 3.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇమ్రాన్ సర్కార్ పడిపోయిన తర్వాత, ఈ అకౌంట్‌ను మార్చేసి, 2018 నుంచి 2022 వరకూ ఉన్న ప్రధానిది అని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Imran Khan
- pak pm
- pak pmo
- Pakisthan
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

