Imran Khan: తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలుశిక్ష
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు తోషాఖానా కేసులో మూడేళ్ల జైలుశిక్ష ఖరారైంది. ఇవాళ ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆ శిక్షను వేసింది. లక్ష రూపాయాల జరిమానా కూడా విధించింది. ఎన్నికల చట్టంలోని 174వ సెక్షన్ కింద ఆ శిక్ష విధించారు. దోషిగా తేలిన ఇమ్రాన్‌ను లాహోర్‌లో అరెస్టు చేశారు.
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) దోషిగా తేలారు. ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆ కేసులో ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అక్రమ పద్ధతిలో ఇమ్రాన్ బహుమతుల్ని అమ్ముకున్నట్లు తేల్చారు. ఇమ్రాన్‌కు ఈ కేసులో లక్ష రూపాయాల జరిమానా విధించారు. ఇమ్రాన్‌పై నమోదు అయిన ఆరోపణలు రుజువైనట్లు ఇవాళ విచారణ సమయంలో అదనపు జిల్లా మరియ సెషన్స్ జడ్జి హుమాయున్ దిలావర్ పేర్కొన్నారు.

ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ కావాలనే తప్పుడు వివరాలను వెల్లడించినట్లు కోర్టు తెలిపింది. ఎలక్షన్ చట్టంలోని 174వ సెక్షన్ ప్రకారం కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల అమలు కోసం కాపీ ఆర్డర్‌ను ఇస్లామాబాద్ పోలీసు చీఫ్‌కు పంపించాలని జడ్జి దిలావర్ తెలిపారు.
దోషిగా తేలిన ఇమ్రాన్‌ను లాహోర్‌లో అరెస్టు చేశారు. కోట్ లక్పత్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. జమాన్ పార్క్ కు భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు ప్రత్యేక వాహనంలో ఆయన్ను జైలుకు తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

