శ్రీలంకకు రిలీఫ్.. 2.9 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకారం
Sri Lanka Crisis | గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఊరట కల్పించింది. శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ద్వీప దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్యం కొరతతో ఇబ్బందులుపడుతున్నది. ఈ కారణంతో అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నది.
ఈ క్రమంలో 2.9 బిలియన్ డాలర్ల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద 48 నెలల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకారం తెలిపిందని శ్రీలంక అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 48 నెలల్లో ఈ రుణం అందనున్నది. శ్రీలంకలో స్థూల ఆర్థిక స్థిరత్వం, అదే సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రుణ సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆర్థిక సహాయానికి ముందు ఐఎంఎఫ్ అనేక దిద్దుబాటు చర్యలు చేపట్టాలని లంకకు సూచించింది. రుణ స్థోమతను నిర్ధారించడానికి, ఆర్థిక అంతరాన్ని తగ్గించడంలో సహాయపడేందుకు భాగస్వాములు, దాతల నుంచి రుణ సహాయాన్ని పొందాలని సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

