Volcano Eruption | చూడగానే అబ్బురపరుస్తున్న ఈ దృశ్యం ఒక అగ్నిపర్వత విస్ఫోటనానిది. పశ్చిమ ఐలాండ్‌లోని గ్రిండవిక్ పట్టణ శివార్లలో అగ్నిపర్వతం బద్దలై ఇలా నిప్పులు చిమ్ముతున్నది.
అగ్నిపర్వతం నుంచి ఎర్రటి లావా పొగలు కక్కుతూ ప్రవహిస్తున్నది. ఐలాండిక్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఈ చిత్రాన్ని కెమెరాలో బంధించారు.